నమస్తే శేరిలింగంపల్లి: ఖానామెట్ లోని అసైన్డ్ భూములను నిబంధనలకు నీరు గారుస్తూ కొందరు కబ్జాదారులు కాజేయాలని ప్రయత్నిస్తున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ నాయకులు ఏకాంత్ గౌడ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం రాజ్ భవన్ రోడ్డు లోని దిల్ కుషా గెస్ట్ హౌజ్ లో నేషనల్ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారిని ఏకాంత్ గౌడ్ కలిసి ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఖానామెట్ లోని అసైన్డ్ భూములను నిరుపేదలైన అసైన్డ్ దారుల నుండి బడాబాబులు నిబంధనలకు విరుద్ధంగా కాజేస్తున్నారని శేరిలింగంపల్లి తహశీల్దార్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏకాంత్ గౌడ్ తెలిపారు. విచారణ జరిపి అసలు వారసులైన నిరుపేద అసైన్డ్ దారులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.