నమస్తే శేరిలింగంపల్లి: మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను మంగళవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రామ్ గూడలో డివిజన్ బిజెపి అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ గంగాధరరెడ్డి హాజరై శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, దేశానికి ఒకే జెండా ఒకే రాజ్యాంగం ఒకే ప్రధాని ఉండాలి అని , నెహ్రూ తీసుకువచ్చిన 370 ఆర్టికల్ ని వ్యతిరేకించిన మహోన్నత వ్యక్తి కొనియాడారు. కులమతాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలందరి పై ఉందని, అదే ఆశయంతో భారతీయ జన సంఘ్ స్థాపించారని తెలిపారు. అఖండ భారతదేశ స్ఫూర్తిని గుండెగుండెలోనూ రగిలించిన జాతీయవాది, నిరాండబరతకు నిదర్శనంగా నిలిచిన జననేత, దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన స్ఫూర్తిప్రదాత డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా కోశాధికారి రమేష్ సోమిశెట్టి, రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి రవీందర్ రెడ్డి, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి , జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, జిల్లా నాయకులు స్వామి గౌడ్, సంతోష్ సింగ్, అశోక్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు నక్క శివ కుమార్, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, శివ సింగ్ , సంతోష్ సింగ్ , దేవేందర్ రెడ్డి , బబ్లూ సింగ్ , ధనరాజ్ సింగ్, కాంత్ రెడ్డి , దేవేందర్ రెడ్డి, కొండ గోపాల్ ,ఆర్ వెంకటేష్ , మహేశ్వరి, రాఘవ రావు , దయాకర్ ,శంకర్ యాదవ్ ,కిషన్ సింగ్ , తిరుపతి ,గుండప్పా, రాజు , రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
