నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ ప్రశాంత్ నగర్ కాలనీలోని శ్రీసీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు బుదవారం నిరాడంబరంగా జరిగాయి. ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ, శామలదేవి దంపతులు, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌లు ఉత్సవాల్లో పాల్గొని శ్రీ సీతారాముల కల్యాణ వైభవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రతి ఏడు ప్రశాంత్‌నగర్ రామాలయంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారామల కల్యాణ మహెత్సవం కరోనా ఉదృతి నేపథ్యంలో ఈ ఏడాది పరిమిత భక్తులతో జరుపుకోవాల్సి వచ్చిందని అన్నారు. శ్రీరాముడి కృపతో కరోనా పూర్తిగా అంతమయ్యి వచ్చే ఏడాది రెట్టింపు ఉత్సాహంతో వేడుకలను నిర్వహించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు చక్రవర్తుల రాజగోపాలాచార్యులు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు దాసరి గోపికృష్ణ అనిత దంపతులు, సభ్యలు పూర్ణచందర్‌రావు, ఆచర్యులు, సత్యనారాయణ, శ్రీనివాస్‌రావు, వినాయక రావు, తదితరులు పాల్గొన్నారు. మియాపూర్ డివిజన్ గౌరవ కార్పొరేటర్ శ్రీ ఉప్పలపాటి శ్రీకాంత్ గారు మరియు డివిజన్ ముఖ్య నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.