నమస్తే శేరిలింగంపల్లి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ ఎస్ఆర్ ఎస్టేట్స్‌లో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో బుదవారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు గంగాధర శాస్త్రీ పర్యవేక్షణలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిగిన ఈ వేడుకలలో పంచలోహ విగ్రహదాత దోనేపూడి శివ రామ కృష్ణ ప్రసాద్, రమాదేవి దంపతులు స్వామివారి కల్యాణం జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారాముల కటాక్షంతో కరోనా నుంచి ప్రజలంతా విముక్తి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రసాదరెడ్డి, కృష్ణమోహన్ ఎస్ఆర్ ఎస్టేట్స్ వాసులు పాల్గొన్నారు.