ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పాపమ్మ బస్తీ వాసులతో స్థానిక కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. బస్తీ అభివృద్ధి పై ప్రత్యేకంగా చర్చించారు. కాగా పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని బస్తీ వాసులు కార్పోరేటర్ ను కోరారు. సానుకూలంగా స్పందించిన దొడ్డి వెంకటేష్ గౌడ్ పెండింగ్ పనులతో పాటు అవసరమైన అభివృద్ధి పనులను పూర్తి చెసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు రామక్రిష్ణ గౌడ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు జిల్లా గణేష్, మహిళ అధ్యక్షురాలు కుమారి, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు మంజుల, వార్డు సభ్యులు కాశినాధ్ యాదవ్, బీసీ సెల్ ప్రెసిడెంట్ రాజేష్ చెంద్ర, నాయకులు పంచమి గణేశ్, కృష్ణ, రాము, వాసు, యాదగిరి, భాస్కర్, సాంబిరెడ్డి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.