హైదర్ నగర్ (నమస్తే శేరిలింగంపల్లి): డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ లో సుమారుగా 21 లక్షల రూపాయల అంచనావ్యయంతో చేపట్టిన ఫూట్ ఫాత్ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ జానకి రామ రాజు, బల్దియా అధికారులతో కలిసి గౌరవ ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ఫుట్ ఫాత్ నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజి పడకూడదని, పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని, మరియు మెరుగైన,సుఖవంతమైన రవాణా సౌకర్యం కలిపిస్తామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డీఈ సత్యనారాయణ, ఏఈ రాజీవ్, డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు నార్నె శ్రీనివాస రావు, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు రావూరి సైదేశ్వర్ రావు, కోనేరు కృష్ణ ప్రసాద్, కృష్ణ ముదిరాజ్, పోతుల రాజేందర్, సుబ్బారావు, శ్రీహరి, అష్రాఫ్, వెంకటేష్ యాదవ్, శ్రీకాంత్, ఖదీర్, సద్దాం, కృష్ణ కుమారి, విమల , స్వప్న , పద్మ, విజయ , రేణుక, కాలనీ వాసులు వేదమూర్తి, కిషోర్, ఉమామహేశ్వర్ రావు , రంగనాధ రాజు , తదితరులు పాల్గొన్నారు.