-1980స్ మిలటరీ హోటల్ ను ప్రారంభించిన దర్శకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణ
గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): నాగచైతన్య, సమంత జంటగా ‘మజిలీ’ మూవీని, తాజాగా నాని హీరోగా ‘టక్ జగదీష్’ చిత్రాన్ని నిర్మిస్తోన్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది హోటల్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ప్రముఖ డైరెక్టర్ సుధీర్ వర్మ సోదరుడు ఫణి వర్మతో కలిసి హైదరాబాద్‌లో 1980 మిలటరీ హోటల్ ప్రారంభించారు. ఖాజగూడ-నానక్‌రామ్ గూడ రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన ఈ హోటల్‌ను సోమవారం ఉదయం నిర్వాహకులు అనిల్ రావిపూడి, శివ నిర్వాణలు లాంఛనంగ ప్రారంభించారు. హోటల్ పేరు ఆకట్టుకునే విధంగా ఉందని, ఈ హోటల్‌కు మంచి ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సంప్రదాయబద్ధమైన, నోరూరించే తెలుగింటి రుచులతో, అత్యంత పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తమ హోటల్లో అందిస్తామని తెలిపారు.