హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): ఎంపీ రంజిత్ అన్న యూత్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ ప్రెసిడెంట్ బాలింగ్ గౌతమ్ గౌడ్, తెరాస సీనియర్ నాయకుడు, ఎంపీ రంజిత్ అన్న యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ కటకం నేత, తెరాస మైనార్టీ నాయకుడు జహీరుద్దీన్, యువ నాయకులు జెంషేడ్ రవి, ప్రేమ్ కుమార్, లక్ష్మణ్, నరేష్, ధన్ రాజ్, హనీఫ్, ప్రకాష్ పాల్గొన్నారు.






