శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని తారానగర్ తుల్జా భవాని ఆలయం ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన లయన్స్ క్లబ్ (హోప్) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్నట్లు తారానగర్ తుల్జాభవానీ ఆలయ పాలక మండలి ఒక ప్రకటనలో తెలియజేసింది. ముగ్గులకు హాజరయ్యే మహిళలు తమ రంగులు, సామగ్రిని వారే తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (హోప్) ఆధ్వర్యంలో బహుమతులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనే మహిళలు విధిగా మాస్క్‌ను ధరిస్తూ కరోనా జాగ్రత్తలను పాటించాలని సూచించారు.






