- జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డితో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా కలిసి, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్ ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై జోనల్ కమిషనర్ తో చర్చించినట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని, అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని, అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అధిక మొత్తంలో నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.
పనులలో వేగం పెంచాలని సకాలంలో నిధులు మంజూరు అయ్యేలా చూడాలని , అభివృద్ధి పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని, అదేవిధంగా మంజీర పైప్ లైన్ రోడ్డు నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలని, శ్రీదేవి థియేటర్ నుండి అమిన్ పూర్ రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన చేపట్టాలని, గంగారాం హనుమాన్ దేవాలయం ప్రధాన రహాదారి నుండి అపర్ణ వరకు లింక్ రోడ్డు పనులు త్వరితగతిన ప్రారంభంయ్యేలా చూడలాని, ప్రజఅవసరాల దృష్ట్యా లింక్ రోడ్ల పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని, కూడలి ల సుందరి కరణ చేపట్టాలని, చెరువుల సుందరీకరణ, పార్క్ లు అభివృద్ధి చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజి పడకూడదని, అధికారులతో చర్చించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు ఏర్పాటు కు కృషి చేయాలని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు.
వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, వర్షాకాలంలో గల ఎదురయ్యే సమస్యల పట్ల పూర్తి స్థాయిలో సన్నద్ధం అయ్యేలా అధికారులకు అదేశాలు ఇవ్వాలని, మాన్ సున్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండేలా చూడాలని, అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని ఎమ్మెల్యే గాంధీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకు వెల్లారు. దీని పై జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు.