కత్తులతో పొడిచి.. బండరాయితో మోది..

  • న్యూ హఫీజ్ పేట్ లో యువకుడి దారుణ హత్య
  • పాతకక్ష్యల నేపథ్యంలో ఘటన

నమస్తే శేరిలింగంపల్లి: పాతకక్ష్యల నేపథ్యంలో ఓ యువకుడి ని దారుణంగా హత్య చేసిన సంఘటన న్యూ హఫీజ్ పేట్ లో చోటు చేసుకున్నది. కత్తులతో పొడిచి ఆపై బండరాయితో మోది చంపిన ఈ ఘటన మియాపూర్ పొలీస్ స్టేషను పరిధిలో చోటు చేసుకున్నది. యస్ ఐ అహ్మద్ పాషా తెలిపిన వివరాల ప్రకారం..బొరబండ కు చెందిన  ఆకిల్ (25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అకిల్ గతంలో న్యూ హాఫిజ్ పేట్ ప్రేమ్ నగంలో ఉండేవాడు.

బక్రీద్ పండుగ పురస్కరించుకొని స్నేహితుల ఆవ్వాహనం మేరకు ఆకిల్ శనివారం. హఫీజ్ పేట్ కు వచ్చాడు. స్నేహితులు అసిఫ్, అబ్బాస్ , సమీర్ ఖాన్ ,హమీద్ , అస్లం ఖాన్, పరిదుద్దిన్ తో కలిసి మధ్యాహ్నం నుంచి వారంతా మద్యం సేవించారు. అర్థరాత్రి అయినా మద్యం తాగుతూనే ఉన్నారు. ఈక్రమంలో అకిల్ వారి స్నేహితుల మధ్య డబ్బుల గురించి గొడవ తలెత్తింది. అయితే వారంతా కలిసి ఆకిల్ ను మొదట కత్తులతో పొడిచి బండరాయి తో మోదడంతో అక్కడికక్కడే మరణించాడు. అయితే ఆకిల్ పై రౌడీ షీట్ ఉన్నట్లు ఈ క్రమంలో పాత కక్షలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. స్థానికుల గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందుతులను అదుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here