- 46.14 స్ట్రైక్ రేట్.. 323 పరుగులు..
- వరుసగా నాలుగు అర్ధ సెంచరీలు..
- మొదటి ఆటగాడిగా రికార్డు
- టోర్నీలో అద్భుత ప్రదర్శన
- అవార్డు అందజేసిన విశ్వజిత్ కంపాటి, ఐపీస్
- ముగిసిన 2వ రెనోవా ఫ్రెండ్‌షిప్ కప్ టోర్నమెంట్ – 2023
- విజేతగా నిలిచిన హైడ్ వాటర్ వర్క్స్ క్రికెట్ టీమ్
అతను క్రీజులో నిలబడితే ప్రేక్షకులకు ఆనందం..ప్రత్యర్థులకు ముచ్చెమటలు ఖాయం, బ్యాట్ పడితే సిక్సర్ల సునామీ..ఫోర్ల మోత మొగాల్సిందే…అతడే వంశీ మోహన్ రెడ్డి. ఫ్రెండ్ షిప్ కప్ టి-20 టోర్నమెంట్ పరుగుల వరద సృష్టించాడు. తానాడిన 8 మ్యాచుల్లో 46.14 స్ట్రైక్ రేట్ తో 323 పరుగులు చేయడంతో రెండో స్థానంలో నిలిచాడు. ఇందులో మొత్తం 38 ఫోర్లు బాదాడు. అంతేకాదు వరుసగా నాలుగు సెంచరీలు చేసిన మొదటి బ్యాట్స్ మెన్ గా రికార్డ్ సాధించాడు.
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీస్ క్రికెట్ టీం తరఫున ఒపెనింగ్ బ్యాట్స్ మెన్ గా బరిలో దిగి అదరగొట్టాడు. టోర్నిలో అత్యధిక పరుగులు చేసినందుకు తనకు అవార్డు వరించింది. ఈ అవార్డును ముఖ్య అతిథిగా హజరైన విశ్వజిత్ కంపాటి ఐపీస్ అందజేశారు. ఆదివారం టోర్నీ ముగిసిన అనంతరం అవార్దును అందుకున్నారు.
అంతేకాదు టోర్నమెంట్ లో నాలుగు అర్థసెంచరీలు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 2వ రెనోవా ఫ్రెండ్‌షిప్ కప్ టోర్నమెంట్ – 2023లో ఆఖరి మ్యాచ్ ఆదివారం ఉప్పల్ ఫతుల్‌గూడ క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహించారు. టిఎస్పీడిసి ఎల్ ఎలక్ట్రిసిటీ బోర్డును ఓడించడంతో హైడ్ వాటర్ వర్క్స్ క్రికెట్ టీమ్ విజేతగా నిలిచింది.