సంక్షేమానికి అసలైన నిర్వచనం చెప్పిన నాయకుడు డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి

  • నియోజవర్గంలోని పలు డివిజన్ లలో వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించిన రాష్ట్ర యువనాయకులు రఘునాథ్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సంక్షేమ సారథిగా దివంగత మహానేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటారని కాంగ్రెస్ రాష్ట్ర యువనాయకులు రఘునాథ్ యాదవ్ తెలిపారు. ఆ మహానాయకుని జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. మాదాపూర్ 100ఫీట్ రోడ్డు లో ఉన్న వైస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కూకట్ పల్లి హోసింగ్ బోర్డు బస్టాండ్ దగ్గర వైస్సార్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా. రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు అందించిన సేవలను స్మరించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపిస్తూనే, ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసిన అరుదైన నాయకుడు వైఎస్ అని కొనియాడారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత కరెంటు, మహిళలకు ఆర్థిక చేయూత, అందరికీ ఆరోగ్య శ్రీ, జలయజ్ఞం లాంటి ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి సంక్షేమానికి అసలైన నిర్వచనం చెప్పిన నాయకుడని గుర్తు చేసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు పొందని ఇల్లు లేదంటే అతిశయోక్తి లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంగల్ రావు, చలం, ఎంజమూరి యాదగిరి, వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి, ఎంఎస్ యుఐ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిస్బ, 114డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్, రంజిత, 117 డివిజన్ అధ్యక్షులు జోజమ్మ, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు సురేష్ , ముఖ్య నాయకులు గోవింద్ గౌడ్, సుధాకర్ రెడ్డి, శోభ, కొడుగు అప్పారావు, ప్రవీణ్ గౌడ్ సందీప్ సాగర్, శివ, కురుమ రాజు, బషీర్ భాయ్, ప్రేమ్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here