మహానేతకు ఘన నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: దివంగత నేత, బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నతుడని టీపీసీసీ ప్రతినిధి ఎస్. సత్యంరావు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి వేడుకలను మాదాపూర్ డివిజ‌న్ లో కాంగ్రెస్ నాయకులు శనివారం ఘనంగా నిర్వహించారు.

టీపీసీసీ ప్రతి‌నిధి సత్యం రావు వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను, పేదల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. పేద ప్రజల అభివృద్ధియే ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు చివరి వరకు శ్రమించిన మహోన్నతుడని కొనియాడారు. వైఎస్సార్ పాలనను ఆదర్శంగా తీసుకుని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ హయాంలో సుపరిపాలన అందిస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విజయకేతనం ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జెరిపెటి జైపాల్, ఆల్ ఇండియా అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్ కన్వీనర్ కౌషల్ సమీర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీవీఎస్ చౌదరి, రఘునందన్ రెడ్డి, రాగం శ్రీనివాస్ యాదవ్, ఎండీ జమీర్, అయాజ్ ఖాన్, భరత్ రెడ్డి, సురేష్ నాయక్, అనిల్ రావు, కర్ణాకర్ రెడ్డి, షేక్ అప్రోజ్, ఎండీ అప్రోజ్, బి. శ్రీనివాస్ యాదవ్, కుమ్మరి వెంకటేష్, మల్లేశ్, బిక్షపతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here