నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. మైసూర్ లో ప్రముఖ భరతనాట్య కళాకారిణి అనఘా ఎంటి తన భరతనాట్య ప్రదర్శనలో భాగంగా చతురాశ్ర మేళప్రాప్తి, దేవర్ణమా, కృతి అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా కుమారి యుక్త రెడ్డి శిష్య బృందం మూషిక వాహన, పంచాక్షరీ, వేంకటాచల నిలయము, శ్రీ రాఘవం, కృష్ణాష్టకం, పుష్పాంజలి, అయిగిరినందిని, బ్రహ్మమొక్కటే, గోవిందా గోవిందా, నవరసాలు, లింగాష్షకం, మహాగణపతిమ్ అంశాలను కుమారి యుక్త రెడ్డి, మాధురి, అనిత, నమ్రత, శాన్వి, నేహా, నక్షత్ర, గీతికా, రైతు, ఐశ్వర్యలు ప్రదర్శించి మెప్పించారు.