- పాల్గొని ఆవిష్కరించిన మాజీ మంత్రి క్రిష్ణయాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: యాదవులను ఐక్యం చేసి ఏకతాటిపై నడిపించేలా ముందుకు సాగాలని మాజీ మంత్రి క్రిష్ణయాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ నాచారం ఏఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో కిరణ్ కుమార్ యాదవ్ (సీఈఓ) అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా “యాదవ విజన్ తెలుగు” యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తూ.. ఆ ఛానల్ లోగో ను ఆవిష్కరించారు. యాదవుల కోసం యాదవ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కిరణ్ కుమార్ యాదవ్ ని, కొన్నెండ్లుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ యాదవుల అభివృద్ధి కోసం నిత్యం పరితపించే వ్యక్తి భేరి రామచందర్ యాదవ్ ని మాజీ మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని భాషలలో యాదవులకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఉండాలని దాని ద్వారా యాదవులను ఐక్యం చేయాలని రైతుల సమస్యలపై, పంట, పశుపోషణ, యాదవులకు సంబంధించిన అన్ని అభివృద్ధి పనులను యూట్యూబ్ ఛానల్ లో ప్రతి యాదవునికి తెలియజేయాలన్నారు. బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్ స్థాపించి దాన్ని నడిపించాలంటే చాలా కష్టంతో కూడుకున్నదని, ఆర్థికపరమైనదని అన్నారు. ఇన్ని సమస్యలు అధిగమిస్తూ కిరణ్ కుమార్ యాదవ్ “యాదవ విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్థాపించినందుకు అభినందనలు తెలిపారు. యాదవుల సమస్య పరిష్కరించేలా.. గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు “యాదవ విజన్ తెలుగు”యూట్యూబ్ ఛానల్ అందరికీ అందుబాటులో ఉండి అందరికీ సమాచారాన్ని చేరవేయాలన్నారు. ఈ చానల్ ని యాదవులందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, వచ్చే సమాచారాన్ని అందరికీ చెరవేయాలని, ఏమైనా సలహాలు, సూచనల పట్ల తమ అభిప్రాయాలు తెలపాలని, యాదవుల ఐక్యత చాటాలని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా యాదవుల గొప్పతనాన్ని వారి చరిత్రను, సంస్కృతి సంప్రదాయాలను, రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన యాదవుల గొప్పతనాన్ని ప్రతిబింబించేలా ఈ యూట్యూబ్ ఛానల్ ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సి.కృష్ణ యాదవ్ బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భేరి రామచంద్ర యాదవ్, యాదవ విజన్ యూట్యూబ్ ఛానల్ సీఈఓ చెట్టుకింది కిరణ్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కల్పన, చంద్రశేఖర్ యాదవ్ రామకృష్ణ, బిల్డర్ ప్రసాద్ యాదవ్, గోపనబొయిన శ్రీనివాస్ యాదవ్, బేరి ఆంజనేయులు యాదవ్, భేరీ రఘురాం యాదవ్, అందెల సత్యనారాయణ యాదవ్, మల్లేష్ యాదవ్, మధు యాదవ్ యాదవ సంఘం సభ్యులు, పాత్రికేయ మిత్రులు, సీనియర్ రిపోర్టర్లు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా మిత్రులు, యాదవ మహిళలు, వివిధ యాదవ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.