నమస్తే శేరిలింగంపల్లి: చేవెళ్ల పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ బిజెపి పార్టీ కార్యాలయంలో నాలుగు డివిజన్లకు సంబంధించిన బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు, జిల్లా , రాష్ట్ర నాయకులు బిజేవైఎమ్ మహిళా మోర్చా నాయకులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకనందనగర్ కూకట్ పల్లి, కొండాపూర్ డివిజన్లలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఎన్నికల సన్నాహాక సమావేశంలో శేరిలింగంపల్లి బిజెపి ఇన్చార్జి రవికుమార్ యాదవ్, కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు, నరేష్, రామరాజు, మనీ భూషణ్ , నరేందర్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, కేశవ్ పాల్గొన్నారు.
రేపు జరగబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కంకనాబద్ధులై పనిచేయాలని రవికుమార్ యాదవ్ సూచించారు. గత ఎన్నికలలో కొన్ని లోటు పాట్ల వల్ల ఎమ్మెల్యే సీటును కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందేనని, పార్లమెంట్ ఎన్నికలలో నూటికి నూరు శాతం భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలను నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్ ,కమలాకర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, నర్సింగ్ రావు, ఆంజనేయులు సాగర్, నరసింహ చారి, విజిత్, స్రవంతి, గోపాలరావు, శ్రీ హరి యాదవ్, సునీల్ రెడ్డి, నాగరాజు, సీతారామరాజు, బాలు యాదవ్ పాల్గొన్నారు