నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్ వి ఎస్ కళానికేతన్ సమర్పించు “కళానీరాజనం” కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
హేమ వనసర్ల శిష్య బృందం వినాయక కౌతం, చక్కనితల్లికి, బాలాత్రిపురసుందరి, మూషిక వాహన, పలుకే బంగారమయేహ్న , ముద్దుగారే యశోద, రామ కోదండరామా, అయిగిరి నందిని, జతిస్వరం, అష్టలక్ష్మి, పుష్పాంజలి, అన్నిమంత్రములు మొదలైన అంశాలను జస్వితశ్రీ,తన్మయి, హర్షిని, శ్రీదర్శిని, సహస్ర, అనన్య, అనూష, శ్రీప్రియ, ధన్విత, రితిక, భవ్యశ్రీ, కాత్యాయిని, వర్ష మొదలైన కళాకారులూ ప్రదర్శించి మెప్పించారు. నాట్య గురువులు రాధేశ్యామ్, పద్మకల్యాణ్ విచ్చేసి కళాకారులను అభినందించారు.