ముగిసిన వాటర్ పోలో ఛాంపియన్ షిప్ పోటీలు

  • మొదటి విజేత వెస్ట్రన్ రైల్వే
  • రెండవ బహుమతిగా ఇండియన్ నేవీ,
  • మూడవ బహుమతిగా నిలిచిన ఆర్మీ రెడ్
విజేతలతో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ కొండ విజయ్ , ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇండోర్ స్టేడియంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో ఆల్ ఇండియా ఇంటర్ క్లబ్ వాటర్ పోలో ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్ కొండ విజయ్ తో కలిసి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. మొదటి బహుమతిగా వెస్ట్రన్ రైల్వే, రెండవ బహుమతిగా ఇండియన్ నేవీ, మూడవ బహుమతిగా ఆర్మీ రెడ్ జట్లు నిలిచాయి. కార్యక్రమంలో తెలంగాణ స్విమింగ్ సెక్రటరీ ఉమేష్, సమంత్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

పోటీలను తిలకిస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here