మానసిక ప్రశాంతతకు యోగా దోహదం

  • ఘనంగా పతాంజలి ఉచిత యోగా శిబిర 5వ వార్షికోత్సవం
  • శిబిరాన్ని ప్రారంభించిన స్వాభిమాన్ వెస్ట్ జోన్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు, యోగా గురువు నూనె సురేందర్
  • ఉచిత యోగా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: గుల్ మోహన్ పార్క్ కాలనీలోని పార్కులో పతంజలి ఉచిత యోగ శిబిర ఐదవ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత స్వాభిమాన్ వెస్ట్ జోన్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు, యోగా గురువు నూనె సురేందర్ మాట్లాడుతూ నిత్యం యోగా, ప్రాణాయామ చేయడం వల్ల మానసిక ఆందోళన తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు నిర్వహించే పతాంజలి ఉచిత యోగా తరగతులను సద్వినియోగం చేసుకొని, తమ తమ ఆరోగ్య సంరక్షణకు పాటుపడాలని యోగా గురువు గార్ల వెంకటేష్ సూచించారు.

ఉచిత యోగా తరగతులను ప్రారంభించిన యోగా గురువు నూనె సురేందర్

యోగా గురువు రాజేందర్ తివారి మాట్లాడుతూ యోగాతో మానసిక ప్రశాంతత పెరుగుతుందని ఆలోచన విధానం మెరుగవుతుందని జీవన విధానాలు పెరుగుతాయని తెలిపారు. రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత స్వాభిమాన్ వెస్ట్ జోన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్ రాజ పురోహిత్ మరణించడం యోగా సమితికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ యోగా సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. రాజేంద్రప్రసాద్ బిల్డర్ వెంకన్న సాయినాథ్ హరి ఓం జై లక్ష్మీ గాయత్రి విజయ్ యోగ గురువు సాయి ప్రియతో పాటు మరి కొంత (40)మంది యోగి యోగినీలు పాల్గొన్నారు.


యోగా గురువులను సత్కరించిన కాలనీ ప్రతినిధులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here