నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని.. పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నూతన వార్డ్ కార్యాలయంను ప్రారంభించారు.
ప్రజల వద్దకు పాలన అనే ఉద్దేశ్యంతో కార్యాలయాన్ని ప్రారంభించినట్లు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. జిహెచ్ ఎంసి వివిధ సంబంధిత శాఖల అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, మియాపూర్ డివిజన్ బి ఆర్ ఎస్ నాయకులు వివిధ కాలనీల అసోషియన్ సభ్యులతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ వార్డ్ కార్యాలయం ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒక చక్కటి వేదిక అని, ప్రజల చెంతకు పాలన అని ఈ చక్కటి సదవకాశంను కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యాలయానికి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని వార్డు ఆఫీసర్గా నిర్ణయించామని, ఈ అధికారి పర్యవేక్షణలో పారిశుద్ధ్యం, రోడ్ మెయింటెనెన్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, యుబిడి, యుసిడి, జలమండలి, ట్రాన్స్ కో (విద్యుత్) ఇతర విభాగాల నుండి తీసుకోబడిన ఉద్యోగులను ప్రతి వార్డు కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిని పరిష్కరించేందుకు నియమించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డ్ మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, బస్తి కమిటీ మెంబర్లు, ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.