నమస్టే శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కమ్యూనిటీ హాలు ప్రాంగణంలో నిర్మితమైన నూతన వార్డు కార్యాలయాన్ని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై, ప్రారంభోత్సవం చేశారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు, ప్రజల చెంత పాలన ఉండి, ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కారం చూపే విధంగా పరిపాలన ఉండాలనే గొప్ప దృక్పధంతో వార్డు కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవటం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎంతో బిజీగా ఉండే నగరవాసులు తమ సమస్యలు పరిష్కారం కోసం ఈ వార్డు కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వార్డు కార్యాలయలలో ముఖ్యంగా ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, ఎంటమాలజీ, పారిశుధ్యం, జలమండలి, విద్యుత్ తదితర శాఖల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రజలు తమ సమస్యలు వివరాలతో కూడిన పిర్యాదు ఈ వార్డు కార్యాలయంలో నమోదు చేస్తే, వారికీ రసీదు అందించడం, త్వరిత గతిన ఆ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ పి నరేందర్ రెడ్డి, ఇంజనీరింగ్ డీఈ రమేష్, ఏఈ జగదీష్, జలమండలి మేనేజర్ సందీప్, ఎంతోమలజీ ఇంచార్జి అబ్దుల్ సత్తార్, యూసీడి సీఓ పద్మ, ఎలక్ట్రికల్ అధికారులు, జీహెచ్ఏంసీ అధికారులు, కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, సీనియర్ నాయకులు నరసింహ సాగర్, జంగం గౌడ్, రూప రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, గువ్వల రమేష్, కుమ్మరి సిల్వర్ శ్రీనివాస్, సిద్ధిక్ నగర్ ప్రెసిడెంట్ బసవ రాజు, నీలం లక్ష్మి నారాయణ, సాగర్ చౌదరి, విజయ్ కుమార్, వెంకటి, భిక్షపతి, తిరుపతి యాదవ్, తిరుపతి పటేల్, ఇమామ్, నందు, సాగర్ చౌదరి, ఆనంద్ చౌదరి, పి. రామకృష్ణ, సాయి శామ్యూల్ కుమార్, సోమ రాజు, బిక్షపతి, గణపతి, జలీల్ ఖాన్, కరీం, జుబెర్, హినాయత్, విజయ్, కృపాకర్, ఖాసీం, స్వామి సాగర్, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, వెంకటేష్, వీరేష్, సాయి బాబు, షేక్ రఫీ, హినాయత్, సోమరాజు, రఫియా బేగం, శ్యామల, జుబెర్, వసీమ్, జహంగీర్, రమేష్ పాల్గొన్నారు.