సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం

  • ప్రజా ఆశీర్వాద యాత్రలో మొవ్వ సత్యనారాయణ

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ ప్రజా ఆశీర్వాద యాత్ర మియాపూర్ 108వ డివిజన్ టాకీ టౌన్ సినిమా హాల్స్ వద్ద 3వ రోజు విజయవంతంగా కొనసాగింది. మొవ్వా సత్యనారాయణ, కొరడాల నరేష్ , ప్రభాకర్ యాదవ్ ఆధ్వర్యంలో టాకీ టౌన్ సినిమా హాల్స్ నుంచి ఫ్రెండ్స్ కాలనీ, మియాపూర్ విలేజ్, ప్రగతి ఎంక్లేవ్, ఆర్ వి అవనేంద్ర చిరంజీవి నగర్, విడియా కాలనీ మీదుగా కొనసాగించారు. ఈ పాదయాత్రలో భాగంగా ఇంటింటికి తిరిగారు.

నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజా ఆశీర్వద యాత్రలో మొవ్వ సత్యనారాయణ

పలుగురు ఐ టి ఉద్యోగులు నాయకుల్ని కలిసి ట్రాఫిక్ సమస్యల నుంచి మాకు విముక్తి కలిగించాలని అభ్యర్థించారు. దోమల బెడద, అస్తవస్థమైన రోడ్లు, చెరువుల ఆధునికరణలో జరుగుతున్న జాప్యాన్ని చెరువుల ఆక్రమణల గురించి వివరించారు, తదితర అంశాలను స్థానికులు వారి దృష్టికి తీసుకువచ్చారు. పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

బజ్జీలు వేస్తూ..

ఈ సందర్భంగా మొవ్వా సత్యనారాయణ గారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ అరాచకాలను, కబ్జాలను ప్రజలకు తెలియజేస్తూ.. నరేంద్ర మోడీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తెలిసేలా కరపత్రాల పంచుతూ పాదయాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here