నమస్తే శేరిలింగంపల్లి : చందానగర్ పి.జె.ఆర్ స్టేడియంలో వాల్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కు మద్దతుగా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో ఎవరు ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ పార్టీ గెలుపును అడ్డుకోలేరని.. ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణే నిదర్శనమని తెలిపారు.

శేరిలింగంపల్లిలో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, ప్రణాళికలు రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీలో పలువురు సీనియర్ నాయకులు చేరగా వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతించారు.