- కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కూన సత్యం గౌడ్
- కూన సత్యంగౌడ్ రాకతో హైదర్ నగర్ లో తిరుగులేని శక్తిగా కాంగ్రెస్ : టిపిసిసి చైర్మన్ రేవంత్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ లో బీఆర్ఎస్ కు గట్టి దెబ్బే తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కూన సత్యం గౌడ్ బీఆర్ఎస్ కు రాజీనామా చేసి టిపిసిసి చైర్మన్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో శనివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూన సత్యంగౌడ్ రాకతో హైదర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదగనుందని తెలిపారు. కూనసత్యం గౌడ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ గెలుపును ఎవరు అడ్డుకోలేని పరిస్థితి నెలకొన్నదని అన్నారు. హైదర్ నగర్ డివిజన్ లో భారీ మెజారిటీయే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రామకోటేశ్వర్ రావు, కొడాలి శ్రీధర్, రాములు గౌడ్, హోమ్ లాండ్ శ్రీనివాస్, ముజాయత్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.