నమస్తే శేరిలింగంపల్లి : వ్యాపారంలో ఒడిదుడుకులు, మానసిక అనారోగ్యంతో… మద్యానికి బానిసయ్యాడు ఒక యువకుడు. తరచూ మద్యం సేవిస్తూ ఇంట్లోని వస్తువులు పగులగొడుతూ, తల్లిదండ్రులలో గొడవ పడుతు చివరకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మణికొండ పంచవటి కాలనీ, నక్షత్ర అపార్ట్మెంట్స్ లో నివాసం ఉండే కె. శ్రీరామ్ (27) వ్యాపారంలో ఒడిదుడుకులు, మానసిక అనారోగ్యం వేదిస్తుండటంతో మద్యపానానికి అలవాటు పడ్డాడు, తరచుగా మద్యం సేవించి అరవటం, వస్తువులను పగలగొట్టడం, అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో గొడవ పడటం చేస్తుండేవాడు. 5 రోజుల కిందట టీవీ, ఒక మొబైల్‌ను పగలగొట్టాడు. ఈనెల 12న తన చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తున్నాయని చెప్పి బయటికి వెళ్లి 10:40 గంటలకు తిరిగి వచ్చి మద్యం సేవించాడు. 13న ఉదయం 03:30 గంటల సమయంలో కె. శ్రీరామ్ తన తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. 5:50కు తన గది నుంచి బయటకు వచ్చి తన గొంతుపై కత్తితో కోసుకొని ఆత్మహత్యాకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఆపడానికి ప్రయత్నించిన వారి వల్ల కాకపోవటంతో పోలీసులకు సమాచారం అందించారు. కాగా పోలీసులు వచ్చే లోపే శ్రీ రామ్ మృతి చెందాడు.