- తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయమే లక్ష్యంగా ప్రచారం
నమస్తే శేరిలింగంపల్లి : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయమే లక్ష్యంగా .. పులిమేల గ్రామం ఇంచార్జ్, శాసన సభ్యులు కృష్ణ మోహన్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ గురువారం చండూరు మండలంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలలో భాగంగా చండూర్ మండల ఎన్నికల పరిశీలకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నానని, అవకాశం కలిపించినందుకు వారికి కృతఙ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే తెరాస పార్టీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో ప్లోరైడ్ భూతాన్ని మిషన్ భగీరథ ద్వారా తరిమికొట్టిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఎనిమిది ఏండ్లలో చేసిన అభివృద్ధి , సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు ఓ. వెంకటేష్, గురు చరణ్ దుబే, నరేందర్ బల్లా పాల్గొన్నారు.
