నమస్తే శేరిలింగంపల్లి : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యయ్యాడు. మియాపూర్ లో నివసించే చంద్రయ్య (70) ఇంటి నుంచి బయటికి వెళ్లాడు.
ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తన కుమారుడు రవి చుట్టూ పక్కల, తెలిసిన వారి వద్ద ఆచూకీ కోసం వెతికాడు. ఎక్కడ లేకపోవడంతో మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.