- హాజరైన న్యాయముర్తులు, న్యాయవాదులు
నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి కోర్టులోని బార్ అసోషియేషన్ కార్యాలయంలో 2024 నూతన సంవత్సర డైరి, క్యాలెండర్ ను జిల్లా అదనపు న్యాయమూర్తులు కళ్యాణ్ చక్రవర్తి, పావని ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా బార్ అసోషియేషన్ అధ్యక్షుడు. పి. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో న్యాయవాదులకు మంచి జరగలని అభిలాషించారు. కూకట్ పల్లి కోర్టు ఈ కొత్త సంవత్సరంలో నూతన సొంత భవనానికి మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ -అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు మల్లేష్, హరి శంక రెడ్డి, డెవిడ్ రాజు, హర్షవర్షన్ రెడ్డి, శ్రీలత, శివకృష్ణ, జోష్న, చంద్రశేఖర్, శేఖర్ గౌడ్, శ్వేత, బాలాపీర్ తదితరులు పాల్గన్నారు.