నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ కి మద్దతుగా వివేకానంద నగర్ డివిజన్ లో టిడిపి ప్రచారం చేపట్టింది.
మాధవరం కాలనీ బి బ్లాక్, వెంకటేశ్వర్ నగర్ లలో టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ వెంకటరావు, చేవెళ్ల పార్లమెంట్ టీడీపీ కోఆర్డినేటర్ ఎన్స్ రాజు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు ఏకాంత్ గౌడ్, విద్య కల్పన గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, టీడీపీ ఉపాధ్యక్షులు రాము, శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. 30వ తేదీన కాంగ్రెస్ కు ఓటేసి జగదీశ్వర్ గౌడ్ ని ఘనంగా గెలిపించాలని కోరారు.