నమస్తే శేరిలింగంపల్లి: బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తున్నది. ఇందులో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేపట్టిన ఇంటింటి ప్రచారానికి ప్రజలు మద్దతు తెలిపారు. మంగళ హారతులు పట్టి బిఆర్ఎస్ కే మళ్ళీ ఓటు వేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొమ్మిది ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లు తెలిపారు. అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి కానుకగా ఇస్తామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు.

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి తోడ్పడే విధంగా మ్యానిఫెస్టో ఉందని, సబ్బండ వర్గాల ప్రజలకు ఉపయోగంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో విజయం తధ్యమని, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు, తదితరులు పాల్గొన్నారు.