గచ్చిబౌలి పోలీసుల తనిఖీల్లో రూ.5 కోట్లు సీజ్

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు బయటపడింది. ఎన్నికల దృష్ట్యా.. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బొటానికల్ గార్డెన్స్ రోడ్ లోని చిరక్ పబ్లిక్ స్కూల్ సమీపంలో గచ్చిబౌలి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.

పట్టుబడిన నగదు

వైట్ కలర్ మారుతి బ్రీజా (TS 02 EY 2678) లో  తనిఖీ చేసి 5 కోట్ల రూపాయల నగదును గుర్తించారు. ఆ కారులో ప్రయాణిస్తున్న డి. సంతోష్, నరేష్, సంపత్ లను వివరణ అడగగా ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో వారి నుంచి ఆ నగదును సీజ్ చేశారు. తగు చర్యల నిమిత్తం ఐటి శాఖ అధికారులకు అప్పగించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here