- అవినీతి లేని నియోజకవర్గంగా శేరిలింగంపల్లిని తీర్చిదిద్దుదుతారు: జగదీశ్వర్ గౌడ్ కుమార్తె హారిక
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ జగదీశ్వర్ గౌడ్ కు ఎన్నికల ప్రచారంలో అనూహ్యంగా మద్దతు తెలుపుతున్నారు ప్రజలు. అందరివాడుగా పేరుపొందిన ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని వివేకానంద నగర్ డివిజన్లో ప్రతి ఇంటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు ఆయన కుమార్తె కుమార్తె హారిక.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశ కోసం ప్రాణాలర్పించిన కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజులలో 6 సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా అమలు చేస్తామని, న్యాయవాదిగా 3 సంవత్సరాలు కార్పొరేటర్ గా గెలిసిన అనుభవం ఉన్న వ్యక్తిగా అవినీతి మచ్చలేని నాయకుడు జగదీశ్వర్ గౌడ్ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని హారిక కోరారు.