- బొటానికల్ గార్డెన్ లో నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: బొటానికల్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ప్రచారానికి స్పందన లభించింది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ మర్యాదలు లేవని, కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు విలువ ఉండేదని స్థానికులు ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ కు తమ గోడును విన్నవించుకున్నారు.

ఆర్టీసీ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ఆర్టీసీ కార్మికుల ధర్నాలు చేస్తే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ మాట వెనక్కి తీసుకున్నారని తెలిపారు. జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహా నగరాన్ని సుందరీకరణ భాగంలో పార్కులు శ్మశానవాటికలు రోడ్లు, ఫ్లైఓవర్లు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ విషయం సీనియర్ సిటిజన్స్ అయిన మీ అందరికీ తెలుసు అని తెలిపారు.

శేర్లింగంపల్లి నియోజకవర్గం మళ్లీ అభివృద్ధి బాటన పడాలంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయని, కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేసే పార్టీగా మీ అందరికీ తెలుసా అని కాంగ్రెస్ పార్టీతోనే అన్ని విధాలుగా ప్రజలకు మేలు జరుగుతుందని నవంబర్ 30వ తారీఖున హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని జగదీశ్వర్ గౌడ్ కోరారు.