నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ కోరారు.

కొండాపూర్ డివిజన్, రాఘవేంద్ర కాలనీలోని వజ్రశ్రీ నివాసం కమ్యూనిటీ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అసోసియేషన్ వారు పలు సమస్యలు రవి కుమార్ యాదవ దృష్టికి తీసుకురాగా.. గెలిచిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరించి తీరుతామని హామీ ఇచ్చారు. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు.