- కార్పొరేటర్లతో కలిసి స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులర్పించిన గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి : భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన మహోన్నత మూర్తి, యువతకు ఆదర్శనీయులు స్వామి వివేకానంద స్వామి అని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలోని స్వామి వివేకానంద విగ్రహానికి కార్పొరేటర్లు రోజా దేవి రంగరావు, నార్నె శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావుతో కలిసి స్వామి వివేకానంద విగ్రహానికి ఎమ్మెల్యే గాంధీ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఆద్యాత్మిక ఆదర్శాలతో మాతృదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన “వివేకానందుడి” స్ఫూర్తితో నేటి యువత నడయాడలని, వివేకానంద ఆకాంక్షలతో భారతీయులందరికి ప్రపంచ “యువజన దినోత్సవ” శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. మందలో ఒకరిగా ఉండకు.. వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు.. లేవండి.. మేల్కోండి.. గమ్యం చేరేవరకు విశ్రమించకండి అంటూ.. ఇలా ఒకటేంటి ఎన్నో ప్రసంగాలతో.. మరెన్నో సందేశాలతో యువతను ఆకట్టుకున్న యోగి వివేకానంద
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హిమగిరి రావు,భద్రయ్య,కార్తీక్ రావు, రామచంద్ర రావు, శ్రీనివాస్ రెడ్డి ,మోజస్, లింగయ్య, అనిల్, యాదయ్య, ఆంజనేయులు రమణారెడ్డి, శేఖర్ ,మోహన్ రావు ,బాబు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.