నమస్తే శేరిలింగంపల్లి: బీజేపీ బూత్ స్వశక్తికరణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ యువమోర్చా అధ్యక్షులు నక్క శివకుమార్ ఆధ్వర్యంలో తమిళనాడు నుంచి విచ్చేసిన విస్తారక్ అంగప్పన్ నీ గచ్చిబౌలి డివిజన్ యువ మోర్చా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు.
నమో యాప్ గురించి వివరించి, ప్రధాని మోడీ 9 ఏళ్ల సుపరిపాలనా కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం ఉపాధ్యక్షులు నీలం రాఘవేంద్ర, జనరల్ సెక్రెటరీ సామ్రాట్, సెక్రటరీ అరుణ్, సాయి కిరణ్ గౌడ్, శివశంకర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.