న్యూ కాలనీ అభివృద్ధికి అండగా ఉంటాం.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఉప్పలపాటి శ్రీకాంత్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): న్యూ కాలనీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని, కాలనీలోని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, PAC ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో పరిష్కారానికి కృషి చేస్తానని మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీకి చెందిన పలువురు నివాసులు కాలనీలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై శ్రీకాంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీ సమస్యలపై శ్రీకాంత్ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. న్యూ కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను త్వరలోనే స్వయంగా కాలనీలో పర్యటించి పరిశీలిస్తామని చెప్పారు. ప్రజలకు నిత్యజీవితంలో ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న జనాభా, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదని స్పష్టం చేశారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ అభివృద్ధి చెందేలా కృషి చేస్తామని, ప్రజలు సౌకర్యవంతమైన జీవనం సాగించేలా అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తనవంతు సహకారం అందిస్తానని శ్రీకాంత్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో న్యూ కాలనీ వాసులు శంకర్ నాయక్, లావణ్య, కృష్ణ నాయక్, సుబ్బరాజు, లక్ష్మయ్య గౌడ్, నారాయణ రాజు, గాల్ రెడ్డి, బీఎస్ఎన్ సాయి యాదవ్, శ్రీనివాస్, రమేష్, సురేష్ గౌడ్, దుర్గేష్, జె. శంకర్, ప్రవీణ్ రెడ్డి, సురేందర్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here