శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్‌లోని మల్లన్న గుడి వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 50 పూల మొక్కలను నాటారు. ప్రతి బుధవారం హరితహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కార్యక్రమ నిర్వాహకుడు మిద్దెల మల్లారెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమాన్ని జనార్దన్ గౌడ్, మిద్దెల మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి, షేక్ జమీర్, తిరుపతి రెడ్డి, శేఖర్ గౌడ్, రామకృష్ణ గౌడ్, సాబెర్, యమాలవలస రాజు తదితరులు నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొమిరిశెట్టి సాయిబాబా, మాధవరం రంగారావు, బొబ్బ నవత రెడ్డి, విజయ రెడ్డి, పార్నంది శ్రీకాంత్, శివరాజ్, డాక్టర్ సుదర్శన్, అల్లావుద్దీన్ పటేల్, బీరప్ప, సంకటి స్వామి, చందర్రావు, అనంత్ రెడ్డి, గౌస్, గంగారాం, సందీప్ రెడ్డి, గంగారాం, సునీల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరై సహకరించిన ముఖ్య అతిథులు, నాయకులు, కార్యకర్తలకు మిద్దెల మల్లారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.





