నమస్తే శేరిలింగంపల్లి: భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సిల్వర్ మనీష్ అధ్యక్షతన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, నన్ను నాయకుడిగా నిలబెట్టింది, ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నాననంటే దానికి శేరిలింగంపల్లి ప్రజల దీవెనే కారణం అన్నారు.
తుది శ్వాస వరకూ అక్కడే ఉంటా… శేరిలింగంపల్లి ప్రజల కోసం పోరాడుతా అన్నారు. చాలా మంది నాపై దుష్ప్రచారం చేస్తున్నారని, శేరిలింగంపల్లి నుంచి టికెట్ రాకపోతే నేను పార్టీ మారుతానని ప్రచారం చేస్తున్నారని, అందులో ఎలాంటి నిజం లేదన్నారు. నా ప్రాణం పోయే వరకూ నేను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉంటాను. కొత్తగా ఏర్పడి రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం కేసీఆర్, కేటీఆర్. సంక్షేమంతో మొదలుపెడితే అభివృద్ధి వరకూ ఏ రాష్ట్రం సాధించలేదని ప్రగతి తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఈ క్రెడిట్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది అన్నారు. మంత్రి కేటీఆర్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని పేర్కొన్నారు. ఎక్కడో వెనకబడిపోయిన తెలంగాణ ఐటీ ఇండస్ట్రీ ఇవాళ దేశంలో నెంబర్ వన్ పొజిషన్‌లో ఉందిఅంటే అది కేటీఆర్ కృషి వల్లే నని వివరించారు. తెలంగాణ నుంచి 2 లక్షల ఐటీ ఎగుమతులు ఇతర దేశాలకు వెళ్తున్నాయంటే ఆ క్రెడిట్ కేటీఆర్‌కు మాత్రమే దక్కుతుందని చెప్పారు. రాజకీయాల్లోకి యువత రావాలని, దేశానికి దిశానిర్దేశం చేయాల్సింది యువతే అన్నారు. తాను పీఆర్‌పీలో ఉన్నప్పటి నుంచి ఎంతో సపోర్ట్ ఇస్తూ తన ప్రతీ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ప్రతీ జర్నలిస్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మనీష్ ఆధ్వర్యంలో బండి రమేష్ చేతుల మీదుగా టి. ఆసీస్ నాథ్ , నందన్ సింగ్ ఠాకూర్, మహేష్, పి . రత్నాకర్, శివ, శ్రీను, మహేష్ సాయి, డి. సాయి కే లను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మల్లికార్జున శర్మ, పార్టీ నాయకులు జి. సంగారెడ్డి, నర్సింగరావు, శేఖర్ గౌడ్, తెప్ప బాలరాజు ముదిరాజ్, అంజద్ అమ్ము , కాకర్ల అరుణ, మునాఫ్, సలీం, షరీఫ్, సత్యారెడ్డి, గౌస్, రవీందర్ పాల్గొన్నారు.