చందానగర్‌లో పారిశుధ్య పనులు, పీజేఆర్ స్టేడియం, ఆలయ కార్యక్రమ ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 19 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్‌లో పారిశుధ్య పనులు, అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే ఆలయ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మియాపూర్ స‌ర్కిల్ డీసీ ర‌మేష్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంకటాద్రి కాలనీలో SAT ఆటో డ్రైవర్లతో కలిసి పారిశుధ్య పనులను తనిఖీ చేసి, పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. అనంతరం పీజేఆర్ స్టేడియాన్ని సందర్శించి, బ్యాడ్మింటన్ కోర్టుతో పాటు అక్కడ కొనసాగుతున్న ఇతర పనుల పురోగతిని పరిశీలించారు.

అలాగే డివైన్ వేస్ట్ కలెక్షన్‌కు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆగస్టు 22న జరగనున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కార్యక్రమం ఏర్పాట్లపై ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడి, అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here