శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రఫీ రంగానికి విశేష సేవలందించిన లూయిస్ డాగ్యూర్‌కు నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ఒక ఫోటో ఎన్నో సజీవ సాక్ష్యాలను నిక్షిప్తం చేస్తుంది. కాలం మారినా ఫోటో ద్వారా ఆనాటి జ్ఞాపకాలను సజీవంగా నిలుపుకోవచ్చు అని పేర్కొన్నారు. సమాజంలో ఫోటోగ్రఫీకి ఉన్న ప్రాధాన్యతను వివరించారు.

కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వాల్మీకి, ఉపాధ్యక్షుడు రాజు, జనరల్ సెక్రటరీ విజయ్, జాయింట్ సెక్రటరీ గణేష్ యాదవ్, కోశాధికారి అన్వర్ ఖాన్, మీడియా పార్ట్‌నర్ దావత్ మహేష్‌తోపాటు అసోసియేషన్ సభ్యులు హర్ష నాయుడు, మొగిలి, శేఖర్, రవి, విష్ణు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ కళను ప్రోత్సహించడం, ఫోటోగ్రాఫర్ల ఐక్యతను చాటడం లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.





