శేరిలింగంపల్లి, ఆగస్టు 19 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనగూడ నారాయణ జూనియర్ కళాశాలలో సురక్షా తిరంగా కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఫిషింగ్, ఫేక్ లింకులు, OTP మోసాలు, లోన్ యాప్ మోసాలు, బెట్టింగ్ యాప్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, సురక్షిత డిజిటల్ విధానాలు వంటి అంశాలపై వివరించారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే పోలీస్ అత్యవసర పరిస్థితుల్లో 112కు ఫోన్ చేయాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీఐ మియాపూర్ విజయ్, సైబర్ వారియర్ సూర్యతేజ, పెట్రోల్ కారు సిబ్బంది పాల్గొని విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించారు.







