నమస్తే శేరిలింగంపల్లి : కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కాలనీకి చెందిన దనుంజయ్ రావు కుమారుడు బేవర సుబ్రహ్మణేశ్వర్ రావు, కుమార్తె దేవర మన్వితకు వినికిడి లోపం ఉండగా… అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీ నుంచి మంజూరైన రూ. 1 లక్ష 60 వేల విలువ గల వినికిడి యంత్ర పరికరాలను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు, అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, భిక్షపతి ముదిరాజ్, జ్యోతి, సువర్ణ పాల్గొన్నారు.