- చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : చందనగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో రూ. 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ చందానగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత లోపించకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.