మియాపూర్ ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి

  • హెచ్ ఎండీఏ అధికారుల నోటీసులను ఉపసహరించుకోవాలి
  • ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ సభ్యులు తుడుం అనిల్ కుమార్
  • ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన 
  • భారీగా కదిలిన ముజఫర్ అహ్మద్ నగర్ ప్రజలు

నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ ప్రభుత్వ భూముల్లో గత 30 సంవత్సరాలుగా నివాసాలు ఏర్పరుచుకొని ముజఫర్ అహ్మద్ నగర్ లో ఉంటున్న పేదల ఇళ్ళకు హెచ్ఎండీఏ అధికారులు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం అన్యాయమని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కమిటీ సభ్యులు తుడుం అనిల్ కుమార్ అన్నారు. పెద్ద భూభకాసురులను వదిలి, పేదలకు నోటీసులు ఇచ్చి భయబ్రాంతులకు గురిచేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఇదేనా ప్రజల పాలన అంటే అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో ముజఫర్ అహ్మద్ నగర్ ప్రజలతో కలిసి రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.

నోటీసులను ఉపసహరించుకొని వారి ఇళ్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ మియాపూర్ డివిజన్ కార్యదర్శి పల్లె మురళి మాట్లాడుతూ.. భూభాకాసురులు, కబ్జాదారులపై అనేక ఫిర్యాదులు చేశామని, వాటిని పట్టించుకోని అధికారులు పేదలపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తుందని, మియాపూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న పేదల బస్తీల జోలికి వస్తే ఎంసీపీఐ(యూ) తరఫున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని, ప్రజలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన 

అనంతరం కలెక్టర్ కు వినతి ఇవ్వగా.. కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యను స్థానిక ఎమ్మార్వోకి అప్పజెప్పారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ కార్యవర్గ సభ్యులు కుబుం సుకన్య, తుకారాం నాయక్, మహిళా సంఘ నాయకుల అంగడి పుష్ప, అనితా శివాని, సుల్తాన్ బేగం, రజియా బేగం, పార్టీ నాయకులు చందర్, కె.వెంకటేష్, కే.సుభాష్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here