నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి అసెంబ్లీ బీజేవైఎం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి మండల ఎమ్మార్వో కార్యాలయ అధికారి సలీమ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ మాట్లాడుతూ యువకులు, నిరుద్యోగులు పోరాడి బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నాటి నుంచి నేటి వరకు ఉద్యోగ నియామకాలు జరపలేదు.. ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. వాటి అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యాలయ కార్యదర్శి కైలా రాజేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల సందీప్, బీజేవైఎం హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు నందు, బీజేవైఎం మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్, బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి, బీజేవైఎం గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ కుమార్, బీజేవైఎం శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు క్రాంతి మాదిగ, బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శులు కిరణ్, శివ యాదవ్, సామ్రాట్ గౌడ్, సాయి సుకుమార్ పటేల్, అఖిల్, బీజేవైఎం నాయకులు అనిల్ పటేల్, శ్రావణ్, వంశీ, లింగస్వామి, నవీన్, ఆదిత్య , కౌశిక్, నాని, రాజు, మణి కిరణ్, నిశాంత్, కృష్ణ, శివ, కిట్టు, శశిధర్, సతీశ్ పాల్గొన్నారు.