శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతాం

  • రూ.5 కోట్ల 28 లక్షల 75వేలతో అభివృద్ధి పనులు
  • సీసీ రోడ్లు, వరద కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వెంకటాద్రి కాలనీ, శివాజీ నగర్, సిటిజన్ కాలనీ, తార నగర్, ఇందిరా నగర్, వేముకుంట, గౌతమి నగర్, జవహర్ కాలనీ, శంకర్ నగర్ ఫేస్ 1, శంకర్ నగర్ ఫేస్ 2 , సత్యనారాయణ ఎన్ క్లేవ్ కాలనీలలో రూ.5 కోట్ల 28 లక్షల 75వేల అంచనావ్యయంతో సీసీ రోడ్లు, వరద నీటి కాల్వ నిర్మాణ పనులకు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ఒకవైపు కరోనా మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో అభివృద్ధి ఆగకూడదనే ఉద్దేశ్యంతో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి సీసీ రోడ్లు, వరద కాల్వ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

వేముకుంట, గౌతమి నగర్ కాలనీలలో రూ. 1 కోటి 10 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, సత్యనారాయణ ఎన్ క్లేవ్ కాలనీ లో రూ.1 కోటి 72.25లక్షల అంచనా వ్యయంతో వరద నీటి కాల్వ నిర్మాణం, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, వెంకటేశ్వర కాలనీ, శివాజీ నగర్, సిటిజన్ కాలనీ, తారానగర్, ఇందిరానగర్ కాలనీలలో రూ.1 కోటి 55.20 లక్షల అంచనా వ్యయంతో చేబట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులు, శంకర్ నగర్ ఫేజ్-1, ఫేజ్- 2, కాలనీలో రూ.56 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, జవహర్ కాలనీలో రూ. 35 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, లక్ష్మీనారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు మిర్యాల రాఘవ రావు, ఉరిటీ వెంకట్ రావు, జనార్ధన్ రెడ్డి, యాదగిరి గౌడ్, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, కర్ణాకర్ గౌడ్, దాసరి గోపి, వెంకటేష్, మల్లేష్ గుప్తా, ఓ.వెంకటేష్, నాగరాజు, ప్రసాద్, గుడ్ల ధనలక్ష్మి, గోవర్ధన్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, అక్బర్ ఖాన్, శ్రీకాంత్ రెడ్డి, పారునంది శ్రీకాంత్, హరీష్ రెడ్డి, కార్తిక్ గౌడ్, నరేందర్ బల్లా, కొండల్ రెడ్డి, యశ్వంత్, సందీప్, ప్రవీణ్, గిరి, అమ్జద్ పాషా, శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాహుల్, అరవింద్, అవినాష్ రెడ్డి, సందీప్ రెడ్డి, సికేందర్, భవాని, పార్వతి, మాధవి, మాన్విత మాధవి, కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, స్థానికులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here