చందానగర్ బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి వెంకటేశం ముదిరాజ్ ఆధ్వర్యంలో “ఆత్మీయ సమ్మేళనం”

  • స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంఘీభావం తెలిపిన కాలనీ అసోసియేషన్ నాయకులు, ప్రజలు, భారతీయ జీవిత బీమా ఏజెంట్ల అసోసియేషన్ నాయకులు
  • బిఆర్ఎస్ ని గెలిపించాలని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ బిఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి దుప్పిల్లి వెంకటేశం ముదిరాజ్ ఆధ్వర్యంలో చందానగర్ ఫ్రెండ్స్ కాలనీలో “ఆత్మీయ సమ్మేళనం” నిర్వహించారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెకపూడి గాంధీ గెలుపునకు మద్దతుగా ఈ ఆత్మీయ సమావేశం నిర్వహించగా.. గాంధీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

చందానగర్ బిఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేష్ ముదిరాజ్ ను ఆలింగనం చేసుకుంటున్న ప్రభుత్వ గాంధీ

బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల అభివృద్ధికి దోహద పడుతున్నాయని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సారధ్యంలో శేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేశామని, ఆ అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని వివరించారు.

ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న వెంకటేశం ముదిరాజ్

30న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు ఓటేసీ గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బిసి రాష్ట్ర నాయకులు డీవీ కృష్ణారావు, కాపు సంఘం ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షులు అరవ రామకృష్ణ, కాలనీ అసోసియేషన్ నవీన్, నాగార్జునరావు, ఫసియుద్దీన్, కృష్ణానాయక్, వరలక్ష్మి, రమేష్ బాబు, రవీంద్రనాథ్, వేణుగోపాల్, గేటెడ్ కమ్యూనిటీ శ్రీ లక్ష్మి శుభం ఆర్కేడ్, వెస్ట్ మెట్రో, క్లాసిక్ పల్లవి, క్లాసిక్ ప్రివిలైజ్, సిగ్మా ప్రైడ్, చిన్మాయ్ రెసిడెన్సీ, గురురాఘవేంద్ర అపార్ట్మెంట్ కాలనీ వాసులతో పాటు భారతీయ జీవిత భీమా ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు రాజమోహన్, దేవుజా, ఎంబీ చలం, ఏజెంట్స్ పెద్దమొతంలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here