- బిజెపి పార్టీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ భారీ రోడ్ షోకు వెల్లువెత్తిన ప్రజా స్పందన
- శేరిలింగంపల్లిలో గెలవబోయేది రవికుమార్ యాదవ్: మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో గెలవబోయేది బిజెపి పార్టీ ఎమ్మెల్యే
అభ్యర్థి రవికుమార్ యాదవ్ అని మాజీ శాసనసభ్యులు భిక్షపతి యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
శేరిలింగంపల్లి భారాస అభ్యర్థిని ప్రజలు తిరస్కరిస్తున్నారని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు భిక్షపతి యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ కమాన్ పరిధి నుండి వేలాదిమంది కార్యకర్తలు, యువకులు మహిళల మంగళహారతులతో మొదలైన భారీ రోడ్ షో ఆల్విన్ కాలనీ డివిజన్, వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ జలకన్య హోటల్, పాపిరెడ్డి నగర్, రిక్షాపుల్లర్స్ కాలనీ, వెంకటేశ్వర నగర్, రామకృష్ణ నగర్, మాధవరం కాలనీ, జలకన్య హోటల్ వరకు రోడ్ షో నిర్వహించారు.
రోడ్ షోలో అడుగడుగునా బస్తీవాసులు మహిళలు మంగళ హారతులతో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రవికుమార్ యాదవ్ కి నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యకర్తలందరూ 30వ తేదీన జరిగే పోలింగ్ కేంద్రానికి వచ్చి బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి రవికుమార్ యాదవ్ కు చెందిన పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, యువ మోర్చా పాల్గొన్నారు.